కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ములుగు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదులు, సమాచారం కొరకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జి ల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొదటి విడత ఎన్నికల్లో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలైన్ బృందాలు, ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ బృందాలను, ఎన్నికల అధికారులను నియమించినట్లు వివరించారు. ప్రజలను ప్రలోభపెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా, ఇతర ప్రభావిత అంశాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే సంఘటనలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 18004257109కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన టీ–పోల్ మొబైల్ యాప్‌ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. గూగుల్ ప్లే స్టోర్ యాప్ అందుబాటులో ఉందని ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ఓటర్ల పోలింగ్, కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్పులు, నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర


