ప్రజావైద్యుడు విద్యాసాగర్ కన్నుమూత
ఏటూరునాగారం: ఆయన ఒక ప్రజావైద్యుడు. పేదలకు కేవలం రూ.3లకే ఇంజక్షన్ వేసి ప్రజల మనలను పొందిన గొప్ప ఆదర్శవాది వంగల విద్యాసాగర్. అయితే ఆయన ఆర్‌ఎంపీగా పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి 2001లో ఏటూరునాగారం నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఐదేళ్లపాటు ఎంపీటీసీగా పనిచేసిన అనంతరం ఆర్‌ఎంపీగా పనిచేస్తూనే కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించి వంగల విద్యాసాగర్(60) గురువారం మృతి చెందాడు. ఎంతో మంది పేద ప్రజలకు తక్కువ ధరకు వైద్యం అందించి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన మరణవార్త విన్న ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యాసాగర్ మరణ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహంపై పార్టీ కండువా కప్పి నివాళులర్పించారు. తొలితరం బీఆర్‌ఎస్ ఉద్యమ నాయకుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెఈ్ప మాజీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, నాయకులు మల్లారెడ్డి, చిన్నికృష్ణ, ఖాజాపాషా, రాంనర్సయ్య, బోజారావు, ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రూ.3కే ఇంజక్షన్ వేసి పేదప్రజల
మన్ననలు పొందిన ఆదర్శవాది


