విత్తన బిల్లుపై అభిప్రాయాల సేకరణ
ములుగు: కొత్త విత్తన బిల్లు–2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటాదారుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కొత్త విత్తన బిల్లు–2025 ముసాయిదాపై జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త విత్తన బిల్లులోని సెక్షన్లు, క్లాసులు, విత్తన చట్టం 1966లోని లోపాలు, కొత్త చట్టం లక్ష్యం గురించి చర్చించారు. ఈ సందర్భంగా హాజరైన రైతులు, విత్తన వ్యాపారులు, విత్తన ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు బిల్లులోని ప్రతీ క్లాజ్‌పై తమ సూచనలు, అభిప్రాయాలను తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అవినాష్ వర్మ, మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.


