నామినేషన్లు 44
జోరుగా నామినేషన్లు
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి/గోవిందరావుపేట: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 22 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేయగా వార్డు స్థానాలకు సైతం 22 నామినేషన్లు మొత్తంగా 44 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేనిది ఎవరిని లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి లోటుపాట్లను సరిచేశారు.
12 జీపీలకు.. 5 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ
ఏటూరునాగారం మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు గాను 5 క్లస్టర్లలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలిరోజు నామినేషన్లు ఏటూరునాగారం నుంచి సర్పంచ్ స్థానానికి రెండు, శంకరాజుపల్లి నుంచి ఒకటి సర్పంచ్ స్థానానికి, ఒకటి వార్డు స్థానానికి నామినేషన్ వచ్చింది. రామన్నగూడెం నుంచి ఒకటి సర్పంచ్, చిన్నబోయినపల్లి నుంచి వార్డు స్థానానికి రెండు, రొయ్యూరు నుంచి ఒకటి వార్డు స్థానానానికి నామినేషన్ దాఖలైనట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు.
సర్పంచ్ స్థానాలకు రెండు..
వార్డు స్థానాలకు 14..
గోవిందరావుపేట మండలంలోని 5 క్లస్టర్‌లలో కలిపి మొత్తం రెండు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు రాగా వార్డు స్థానాలకు 14 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో మచ్చాపూర్ నుంచి జంపాల ప్రభాకర్, పస్రా నుంచి భూక్య సుమలత సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. అలాగే వార్డు స్థానాలకు బుస్సాపూర్ గ్రామం నుంచి ఐదు నామినేషన్లు రాగా మచ్చాపూర్ ఒకటి, గాంధీనగర్ నుంచి ఒకటి, పస్రా నుంచి ఒకటి, గోవిందరావుపేట నుంచి 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని 18 గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మండల పరిధిలో మొత్తంగా 16 సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీరెల్లి గ్రామం నుంచి సర్పంచ్ స్థానానికి వంగరి అనసూర్య, బెజ్జూరి శ్రీనివాస్, దాయ సత్యవతి, జాజ విజయ, నార్లాపూర్ నుంచి భూక్య శ్రీనివాస్, ఊరట్టం నుంచి చర్పా సౌజన్య, కాటాపూర్ నుంచి దిడ్డి మోహన్‌రావు, ఖలిల్ హుస్సెన్, గంగారం నుంచి బడే రజిత, రంగాపూర్ నుంచి ఇర్ప శివప్రసాద్, తాడ్వాయి నుంచి ఇర్ప సుకన్యసునీల్, కల్తి నాగమణి, కొట్టెం ప్రవళిక, బయ్యక్కపేట నుంచి సురకంటి సమ్మక్క, దామెరవాయి నుంచి వట్టం తిరుపతిలు నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలకు కాటాపూర్ నుంచి దిడ్డి మాధవి, దిడ్డి మల్లయ్య, తాడ్వాయి నుంచి దుర్గం నవీన్, దామెరవాయి నుంచి లోడారి సమ్మయ్యలు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 22, వార్డు స్థానాలకు 22 నామినేషన్లు
స్వీకరించిన ఆర్వోలు, ఏఆర్వోలు
కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు
మండలం సర్పంచ్‌లు వార్డులు
ఏటూరునాగారం 4 4
గోవిందరావుపేట 2 14
ఎస్‌ఎస్‌తాడ్వాయి 16 4
నామినేషన్లు 44
నామినేషన్లు 44


