కొనసాగుతున్న మేడారం పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రహరీ నిర్మాణం పనులు బేస్‌మెంట్ పూర్తయి రాతి పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల సాలహారం చుట్టూ ఎనిమిది ఆర్చీ ద్వారాల సీసీ పిల్లర్ల పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయి. గద్దెల చుట్టూ ఆదివాసీ చిత్రాలు, పడిగలతో కూడిన పిల్లర్ల ఏర్పాటుకు సిద్ధం చేశారు. సమ్మక్క– సారలమ్మల గద్దెలను విస్తరణ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. తల్లుల గద్దెల చుట్టూ రాతి పిల్లర్ల ఏర్పాటు చేసేందుకు బేస్‌మెంట్ స్థాయిలో పనులు పూర్తయ్యాయి. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో పాటు గద్దెల ప్రాంగణంలో షో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మేడారంలో ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్డు పనులు వేస్తున్నారు.
కొనసాగుతున్న మేడారం పనులు
కొనసాగుతున్న మేడారం పనులు


