ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను రెండు సమస్యాత్మక మండలాలుగా గుర్తించాం. ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి. నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు స్వీకరిస్తాం. వచ్చే నెల 11న 48 సర్పంచ్‌లకు, 420 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించాలి.
–కలెక్టర్ టీఎస్.దివాకర


