నేటి నుంచి.. నామినేషన్ల స్వీకరణ
మొదటి విడతలో 48 సర్పంచ్, 420 వార్డు స్థానాల్లో ఎన్నికలు
మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే మండలాలు
ములుగు రూరల్: జిల్లాల్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నేటి(గురువారం) నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు.
నామినేషన్లు దాఖలు చేసే జీపీల వివరాలు..
ప్రతీ మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోవిందరావుపేట మండలంలో లక్నవరం జీపీ కార్యాలయంలో లక్నవరం, రాంనగర్, కోటగడ్డ గ్రామాలకు చెందిన వారు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. కర్లపల్లి జీపీ కార్యాలయంలో కర్లపల్లి, బాలాజీనగర్, లక్ష్మీపురం గ్రామస్తులు నామినేషన్ల పత్రాలు సమర్పించాలి. చల్వాయి జీపీ కార్యాలయంలో చల్వాయి, సోమళ్లగడ్డ, మచ్చాపూర్, బుస్సాపూర్, గోవిందరావుపేట జీపీలో గోవిందరావుపేట, రాఘవపట్నం, పస్రా జీపీ కార్యాలయంలో పస్రా, గాంధీనగర్, మొల్లగూడెం, ముత్తపూర్, పాపయ్యపల్లి గామాలకు చెందిన వారు నామినేషన్ల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మండల పరిషత్ కార్యాలయం రూం నంబర్ 1 లో బీరెల్లి, రంగాపూర్, వెంగళపూర్, నార్లాపూర్ గ్రామాలకు చెందిన వారు నామినేషన్ పత్రాలు అందజేయాలి. రూం నంబర్ 2 లో లింగాల, బంధాల, ఊరట్టం, మేడారానికి చెందిన వారు తమ నామినేషన్ పత్రాలు ఇవ్వాలి. తహసీల్దార్ కార్యాలయంలో దామెరవాయి, గంగారం, కాటాపూర్‌కు చెందిన వారు, పంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఎస్ తాడ్వాయి, అంకంపల్లి, పంబాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, మండల సమాఖ్య భవనంలో కామారం, నర్సాపూర్‌కు చెందిన సర్పంచ్, వార్డు స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందజేయాలి. ఏటూరునాగారం జీపీలో ఏటూరునాగారానికి చెందిన వారు మాత్రమే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. రామన్నగూడెం పంచాయతీ కార్యాలయంలో రామన్నగూడెం, కోయగూడెంకు చెందిన వారు మాత్రమే.. రోహిర్ పంచాయతీలో రోహిర్, చెల్పాక, ఆకులవారిగణపురంకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు ఇవ్వాలి. శంకర్‌రాజ్‌పల్లి జీపీలో శంకర్‌రాజ్‌పల్లి, ముల్లకట్టకు చెందిన వారు.. చిన్నబోయినపల్లి పంచాయతీలో చిన్నబోయినపల్లి, శివాపురం, శాపెల్లి, కొండాయి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి.
విధుల్లో 15 మంది ఆర్వోలు,
15 మంది ఏఆర్వోలు
మూడు మండలాల్లో
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మండలం సర్పంచ్ వార్డు ఆర్వోలు ఏఆర్వోలు
స్థానాలు స్థానాలు
గోవిందరావుపేట 18 154 5 5
ఎస్‌ఎస్‌తాడ్వాయి 18 152 5 5
ఏటూరునాగారం 12 114 5 5
నేటి నుంచి.. నామినేషన్ల స్వీకరణ
నేటి నుంచి.. నామినేషన్ల స్వీకరణ


