ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఓ
ములుగు రూరల్: జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి సందర్భంగా శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలను ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్ధప్రసాదం వితరణ చేశారు.ఈకార్యక్రమంలో ఈఓ మహేష్, జిల్లా గ్రంథాలసంస్ధ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
కాటారం: జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ(ఎన్‌ఐపీహెచ్‌ఎం) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ తేనెటీగల బోర్డు సారథ్యంలో కాటారం వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజులపాటు నిర్వహించిన తేనెటీగల పెంపకం ఉచిత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు తేనెతీగల పెంపకంపై అవగాహన కల్పించారు. శ్రీ నేచురల్ హనీ వ్యవస్థాపకురాలు తాళ్లపెల్లి సంజన–రఘుతోపాటు వివిధ ప్రైవేట్ సంస్థల నిపుణులు శిక్షణలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తేనెటీగల వర్గీకరణ, తేనెటీగ పెట్టె, ఉపకరణాల గుర్తింపు, కాలనీ నిర్వహణ, కాలానుగుణంగా నిర్వహణ, తేనె సంగ్రహణ, వ్యాధి, తెగుళ్ల నిర్వహణ వంటి అంశాలపై సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ అందించారు. రైతులు తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం పొందవచ్చని పలువురు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఆత్మకూరి కుమార్‌యాదవ్, పంతకాని మల్లికార్జున్, బొమ్మన భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఓ
ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీఓ


