రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికం
ములుగు రూరల్: భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించడమే రా జ్యాంగ లక్ష్యమన్నారు. అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి అందరికి మార్గదర్శిగా మారాడని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆ నందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
ప్రజల రక్షణ పోలీసుల బాధ్యత
గోవిందరావుపేట: ప్రజల హక్కుల రక్షణ పోలీసుల బాధ్యతని టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్‌లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సుబ్రహ్మణ్యం హాజరై డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అన్నారు. పోలీసులది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని రాజ్యాంగం తమ మీద పెట్టిన పవిత్ర కర్తవ్యమన్నారు. అనంతరం సిబ్బందితో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి తదితర అంశాలను కాపాడేందుకు సంసిద్ధులుగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారామ్, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికం


