‘లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి’
ములుగు రూరల్: కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ నాయకుడు ఎండీ అమ్జద్‌పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గిట్టుబాటు ధర చట్టం, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం, మైక్రో ఫైనాన్స్ దోపిడీని అరికట్టాలన్నారు. విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని కోరారు. స్మార్ట్ మీటర్లను బిగించకూడదని కోరారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. పంటల తేమశాతాన్ని 12 నుంచి 20శాతం వరకు పెంచాలన్నారు. పంటల దిగుమతిని వ్యతిరేకించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, కొమురయ్య, నాగిరెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, వేణు, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.


