మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని ఇంచర్లలో ఇందిరా మహిళా శక్తి చీరలను మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణితో కలిసి ఆయన మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముసినపల్లి కుమార్‌గౌడ్, శానబోయిన అశోక్, తిరుపతి, రాజమొగిలి, రాజు తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్


