కొండాయి బ్రిడ్జి పనులు షురూ.. | - | Sakshi
Sakshi News home page

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..

Nov 26 2025 6:31 AM | Updated on Nov 26 2025 6:31 AM

కొండా

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..

కొండాయి బ్రిడ్జి పనులు షురూ.. నాణ్యతగా పనులు చేపట్టాలి.. సకాలంలో పనులు పూర్తి చేయాలి..

ఐదు గడ్డర్ల నిర్మాణం పూర్తి

కొండాయి బ్రిడ్జి పనులు నాణ్యతగా చేపట్టాలి. గతంలో నిర్మించిన బ్రిడ్జి వరదలకు కొట్టుకుపోయింది. మళ్లీ అలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అందుకు అధికారులు, పాలకులు నాణ్యతగా పనులు చేపట్టి ప్రజలకు పది కాలల పాటు బ్రిడ్జి ఉపయోగపడేలా చూడాలి.

– దబ్బగట్ల కిశోర్‌,

కొండాయి, ఏటూరునాగారం

బ్రిడ్జి పనులు సకాలంలో పూర్తి చేయాలి. ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పనుల్లో జాప్యం లేకుండా చూడాలి. గిరిజనులకు ఎంతో అవసరమైన బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి.

– బొచ్చు ప్రకాశ్‌, కొండాయి, ఏటూరునాగారం

ఏటూరునాగారం: ఎట్టకేలకు కొండాయి బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. మూడేళ్ల నుంచి పెండింగ్‌ పడుతూ వస్తున్న పనులు వడివడిగా అడుగులు పడ్డాయి. నూతన సాంకేతిక విధానాన్ని అమలు చేస్తూ వరద ఎంత ఉధృతి ఉన్నా తట్టుకునే విధంగా నూతన బ్రిడ్జి నిర్మాణం డిజైన్‌వేశారు. జిల్లాలోని ఏటూరునాగారం మండలం కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలో ఉన్న జంపన్నవాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సీతక్క కృషితో రోడ్డు భవనాల శాఖ ద్వారా రూ.16 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పనులను శ్రీ వేంకటేశ్వర కన్‌స్ట్రక్షన్‌ దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. ఈ పనులను 2026 నవంబర్‌ వరకు పూర్తి అయ్యేలా కావాల్సిన చర్యలు తీసుకున్నట్లు ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు తెలిపారు.

24 గడ్డర్లతో నిర్మాణం

బ్రిడ్జి పొడువు 180 మీటర్లు, 7 పిల్లర్లు, 24 గడ్డర్ల(బీమ్‌)తో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. 24 గడర్స్‌ నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు 9 నిర్మాణం పూర్తికాగా మిగతా వాటి నిర్మాణానికి చురుకుగా కార్మికులు పనులు చేపడుతున్నారు. జంపన్నవాగులో ఆరు పిల్లర్లను భూమి లోపటికి 27 మీటర్ల లోతులో ప్రత్యేక టెక్నాలజీతో కాంక్రీట్‌ పిల్లర్లను రెండు నిర్మించారు. మరో ఐదు పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. నిర్మించిన ఆరు పిల్లర్లపై 8 మీటర్ల ఎత్తులో పిల్లర్‌ నిర్మాణం చేపట్టి దానిపై గడర్స్‌ అమర్చిన తర్వాత బ్రిడ్జిపై 8.5 మీటర్ల కాంక్రీట్‌ స్లాబ్‌ నిర్మిస్తారు. ఒక్కో పిల్లర్‌కు మధ్య 22.2 మీటర్ల పొడువు ఉంటుంది. ఈ పిల్లర్ల నిర్మాణం వల్ల ఎక్కడ ఎలాంటి పిల్లర్లు కుంగిన స్లాబ్‌ చెక్కుచెదరకుండా ఉండేలా డిజైన్‌ చేశారు. అంతేకాకుండా సుమారు వందేళ్ల వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేసి దీనిని నిర్మించారు. 2016లో నిర్మించిన ముళ్లకట్ట బ్రిడ్జి పిల్లర్లు 44 మీటర్ల లోతులో దింపగా కొండాయి బ్రిడ్జి వాగుకు 27 మీటర్ల లోతులోకి దింపడం గమనార్హం.

సులభతరం కానున్న రవాణా

కొండాయి వద్ద బ్రిడ్జి 2023 వరదలకు కొట్టుకుపోయి 8 మంది జలసమాది అయిన విషయం తెలిసిందే. దీంతో రవాణా కష్టాలు మూడేళ్లుగా లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతూ జీవిస్తున్నారు. ఈ బ్రిడ్జి పనులు పూర్తి అయితే కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం, కొత్తూరు గ్రామాల గిరిజనులు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఇవేకాకుండా 2028లో వచ్చే మేడారం జాతరకు ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో మేడారం భక్తులకు అందుబాటులోకి వస్తుంది. ఇవేకాకుండా వైద్యం, విద్య, వ్యవసాయం, నిత్యావసర వస్తువుల మార్గం సులభతరం కానుంది.

రెండు పిల్లర్లకు కాంక్రీట్‌ ఫిల్లింగ్‌

ఏడాది వరకు

పనులు పూర్తయ్యేలా చర్యలు

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..1
1/4

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..2
2/4

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..3
3/4

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..4
4/4

కొండాయి బ్రిడ్జి పనులు షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement