కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్పీ
ములుగు రూరల్: ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రాంనాథ్ కేకన్ కలెక్టర్ టీఎస్.దివాకరను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఎస్పీ మొక్కను అందించారు. అనంతరం జనవరి 28నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరపై చర్చించారు.
కన్నాయిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్లపై భీముని నరేశ్ చేస్తున్న ఆరోపణలు సరికాదని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడెం బాబు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు గెండ్ల పాపారావు ఆధ్వర్యంలో నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి సీతక్కపై నరేశ్ చేస్తున్న ఆరోపణలు మానుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనులకు వందశాతం గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. నరేశ్‌కు అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీరీల శ్రీనివాస్, ఆలం సంతోష్, మురళి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి
నిరసన
భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఏరియాలోని సింగరేణి గనుల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. కేంద్ర న్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లు మార్చి కార్మికులను కార్పొరేట్లకు కట్టు బానిసలుగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్, నర్సయ్య, ప్రసాద్‌రెడ్డి, శంకర్, శ్రీనివాస్, పవన్, మల్లేష్, సాజిత్ పాల్గొన్నారు.
రిజర్వాయర్ పనుల
అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. పరిహారం తేల్చకుండా పనులు చేపట్టవద్దని జేసీబీ ఎదుట కూర్చొని పనులను నిలిపేశారు. తాము భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. భూములు కోల్పోయి, పరిహారం అందక తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వినలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో రైతులు విష్ణు, రాజయ్య, ఆశయ్య, మల్లక్క, వెంకటమ్మ ఉన్నారు.
‘ఆర్టిజన్ కార్మికులను
రెగ్యులరైజ్ చేయాలి’
గణపురం: విద్యుత్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గణపురం మండలం చెల్పూరు కేటీపీపీ ప్రధాన గేట్ ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ 23 వేల మంది కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏపీ ఎస్సీబీ రూల్స్(కన్వర్షన్) ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ మొదటివారంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్పీ


