మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా
ములుగు రూరల్: మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణా లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ములుగు నియోజకవర్గానికి చెందిన 9 మండలాల స్వయం సహాయక సంఘాలకు రూ. 2.26కోట్ల చెక్కును అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు సగటు మహిళ ఆత్మగౌరవంగా నిలుస్తున్నాయన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఒక్కో గ్రూపునకు రూ.20 లక్షల రుణాన్ని అందించి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దుతుందన్నారు. మహిళా సంఘాలకు 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 60ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. వాటి ద్వారా 21,364 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ముంజారు కాగా 2,900 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల య సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, ఎల్‌డీఎం జయప్రకాశ్, ఏపీడీ శ్రీనివాస్, జిల్లా, మండల స మాఖ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
యువతకు ఉద్యోగావకాశాలు
టాస్క్ ఆధ్వర్యంలో టెలీ పర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగావకాశాలకు 2024–25 సంవత్సరంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువకులు అర్హులని పేర్కొన్నారు. కంపెనీ వందమంది యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించనుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఫోన్ నంబర్ 9618449360 ద్వారా లేదా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు డిసెంబర్ 1న ములుగు రీజినల్ సెంటర్ నుందు సెలక్షన్ నిర్వహించబడుతుందని వివరించారు. ఎంపికై న అభ్యర్థులకు తొమ్మిది రోజుల పాటు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. నెల వేతనం రూ.20 వేలు అందిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


