ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
అబ్బాయిగూడెం వద్ద రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉన్న ఇసుక లారీలు
వెంకటాపురం(కె): ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మండల పరిధిలోని ఆలుబాక నుంచి అబ్బాయిగూడెం వరకు ఇసుక లారీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నుంచి ఇసుక లారీలు అధిక సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ద్విచక్రవాహనదారులు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక లారీలను రోడ్డుపై నిలపకుండా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి నిలపాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.


