క్రీడలతోనే మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడాకారులకు క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ క్రీడామైదానంలో క్రికెట్ క్రీడాకారుల ఎంపికను భాస్కర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించి వారిని పరిచయం చేసుకుని మాట్లాడారు. జిల్లాలోని పది మండలాల నుంచి చురుకై న క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా టీంగా తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ టీంను హైదరాబాద్‌లో నిర్వహించబోయే జిల్లాల టోర్నీకి పంపించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు క్రీడలపై మక్కువ పెంచుకొని చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ తక్కలపల్లి దేవేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండెపల్లి సత్యం, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వావిలాల జనార్దన్, మండల అధ్యక్షుడు దుర్గం దుర్గారావు, కోచ్ లకావత్ రాణాప్రతాప్, క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
భాస్కర్‌రెడ్డి


