ఐటీడీఏ భవనం తరలించొద్దని ధర్నా
ఏటూరునాగారం: ఐటీడీఏ భవనాన్ని తరలించొద్దని కోరుతూ సోమవారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఐటీడీఏ భవనానికి నిధులు మంజూరు చేయటం అభినందనీయమన్నారు. ఆకులవారి ఘనపురంలో ఉన్న ఐటీడీఏ భవనం ఆదివాసీల అస్తిత్వానికి చిహ్నంగా ఉందన్నారు. దీన్ని తరలించడం వల్ల ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చుట్టు పక్కల మండలాలకు సెంటర్ పాయింట్‌గా ఉన్న కొమురంభీమ్ స్టేడియాన్ని గ్రామస్తులు వ్యాయామం, స్కూల్ పిల్లలు ఆటలు ఆడుకునేందుకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏపీవో వసంతరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్, సమ్మయ్య, అనసూయ, లక్ష్మయ్య, రామన్న, ఫణికుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


