అందెశ్రీ సంస్మరణ సభ
ములుగు: జిల్లా కేంద్రంలో సోమవారం కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అందెశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు గోల్కొండ బుచ్చన్న మాట్లాడారు. పశువుల కాపరిగా మొదలైన అందెశ్రీ జీవితం లోక కవిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చారని తెలిపారు. జానపద, పల్లె, ఉద్యమ గీతాలతో పాటు రాష్ట్ర గీతం అందించిన మహాకవి అందెశ్రీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఇరుగు పైడి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి, నాయకులు మడిపెల్లి శ్యాంబాబు, చంటి భద్రయ్య, సమ్మయ్య, రవి, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.


