వందేమాతరం వార్షికోత్సవ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

వందేమాతరం వార్షికోత్సవ ర్యాలీ

Nov 25 2025 10:40 AM | Updated on Nov 25 2025 10:40 AM

వందేమాతరం వార్షికోత్సవ ర్యాలీ

వందేమాతరం వార్షికోత్సవ ర్యాలీ

వందేమాతరం వార్షికోత్సవ ర్యాలీ

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరై మాట్లాడారు. బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాన్ని స్మరించుకుంటూ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ కార్యక్రమం వార్షికోత్సవాన్ని ఏడాది పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌లో ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి, జనార్దన్‌, లవన్‌, మహాలక్ష్మీ, స్వరూప, కృష్ణవేణి, సీతయ్య, సత్యం, రోహిత్‌, రవికిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement