జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపిక
ములుగు/ములుగు రూరల్: జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మల్లంపల్లి విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల పీడీ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం విద్యార్థులు శమంత్, ఆకాష్‌లు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో జరిగే పోటీలలో పాల్గొంటారని వివరించారు. ఈ మేరకు జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ అంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్న, ఉపాధ్యాయులు రహీంపాషా, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శోభన్, పూర్ణచందర్, హేమాద్రి, తిరుపతి, శేఖర్, టెన్నికాయిట్ అసోసియేషన్ బాధ్యులు విద్యార్థులను అభినందించారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు..
ఈ నెల 28 నుంచి సంగారెడ్డిలోని డీవైఎస్‌ఓ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ములుగు సన్ రైజర్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల కరస్పాండెంట్ పెట్టెం రాజు తెలిపారు. జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులు కార్తీక్, వెంకటేశ్, ప్రేమ్‌సాయి, దర్శిని, హర్షిత, రవళిని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ జనార్దన్, పీఈటీలు శ్రీకాంత్, శివ, మహిపాల్ పాల్గొన్నారు.


