గిరిజన దర్బార్‌లో వచ్చిన వినతులు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు ఐటీడీఏలో సర్వేయర్‌గా, మరో వ్యక్తి నైట్‌వాచ్ మెన్‌గా నియమించాలని ఏపీఓను కోరారు. ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని గిరిజనులు కోరారు. వెంకటాపురం(కె) గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సీఆర్‌టీ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారు పాసుపుస్తకం బదలాయించాలని కోరారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో బాలుర హాస్టల్‌లో వర్కర్‌గా నియమించాలని గిరిజనుడు కోరారు. మహాముత్తారం మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు పోడు భూమి కి పట్టాలు ఇప్పించాలని కోరారు. వాజేడు మండలానికి చెందిన గిరిజనులు నీరు, విద్యుత్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీఓను కోరారు. మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన భూమిని సర్వే చేయించి పట్టా ఇవ్వాలని ఓ గిరిజనుడు వేడుకున్నాడు. ఏటూరునాగారం ఆకులవారిఘణపురంలో తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అదే విధంగా ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకునేందుకు ఐటీడీఏ కాంప్లెక్స్‌లో గది ఇప్పించాలని ఓ గిరిజనుడు కోరారు. ఈ గిరిజనదర్బార్‌లో డీడీ జనార్దన్, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేశ్‌బాబు, డీటీ అనిల్, హెల్త్ ప్రోగ్రాం మేనేజర్ మహేందర్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, ఆలెం కిశోర్, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


