పథకాలపై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: కార్మిక సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో కార్మిక సంక్షేమ పథకాల అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న సహాయ కార్మిక శాఖ అధికారి వినోద, ఆర్డీఓ వెంకటేశ్‌ల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సభ్యులకు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రకాల పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్మికుల నూతన కార్డు అప్‌లై చేసుకునే విధానం, బెన్ఫిట్స్ పొందే విధానంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


