‘గ్రంథాలతో దేవాలయాల చరిత్ర తెలుసుకోవచ్చు’
కన్నాయిగూడెం: త్రైత సిద్ధాంత గ్రంథాలతో దేవాలయ చరిత్ర తెలుసుకోవచ్చని త్రైత సిద్ధాంత ప్రబోధ మహబూబాబాద్ కమిటీ అధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. మండల పరిధిలోని ముప్పనపల్లిలో త్రైత సిద్ధాంత గ్రంథాల ప్రచారంలో భాగంగా ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా నిజ అర్ధాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఏడు గోవులు, ఏడు ద్వారాలు, ధ్వజస్తంభాలు, గంట ప్రదక్షిణలు మొదలగు వాటి గురించి తెలియజేశారు. త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం శ్రీకృష్ణుడి అసలైన జ్ఞానాన్ని తెలుపుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వీరస్వామి, స్వామి, వంశీ, లళిత, సుష్మ, రజిత, సంతోష్, రేఖ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


