కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపాలి
ములుగు రూరల్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్‌రెడ్డి
ములుగు రూరల్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ములుగుకు చెందిన చింతలపూడి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ క్రికెట్‌లో జిల్లా క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రోత్సహించడానికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు జైపాల్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రశాంతంగా
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ములుగు రూరల్: జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్) ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. ములుగు మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ స్కూల్, ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు 247 మంది విద్యార్థులకు గాను 242 మంది పరీక్షకు హాజరు కాగా ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు.
క్లిిప్పింగ్.. ఫెన్సింగ్
ఏటూరునాగారం: గతంలో మనం పొలాలకు రక్షణగా కట్టెలు పాతి వైర్లను తాళ్లతో కట్టేవాళ్లం. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సైతం అందిపుచ్చుకుంటున్నారు. మండల పరిధిలోని షాపెల్లికి చెందిన ఓ రైతు తన పొలంలోకి పశువులు రాకుండా క్లిప్పింగ్‌లను అమర్చి తీగలు కిందకు రాకుండా, వదలు కాకుండా ఉండేలా అమర్చాడు. దీంతో ఆ పెన్సింగ్‌ను చూస్తే అచ్చం సోలార్ ఫెన్సింగ్ లాగే కనిపిస్తూ ఆకట్టుకొంటుంది.
క్లీనింగ్ డ్రైవ్
హన్మకొండ కల్చరల్: వరల్డ్ హెరిటేజ్ వీక్ పురస్కరించుకుని స్వచ్ఛత అభియాన్ క్లీనింగ్ డ్రైవ్‌లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించా రు. దేవాలయ పురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్, కో–ఆర్డినేటర్ నిరంజన్, ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు ఉపేంద్రశర్మ, పు రావస్తుశాఖ, దేవాదాయశాఖ సిబ్బంది తరలివచ్చిన విద్యార్థులు పాల్గొని చీపురుకట్టలతో, పారలతో ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపాలి
కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపాలి


