జాతర పనులకు నాణ్యతలేని ఇసుక?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర అభివృద్ధి పనులకు నాణ్యత లేని ఇసుక వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మేడారం జంపన్నవాగులోకి భక్తుల పుణ్యస్నానాల కోసం లక్నవరం నీటిని విడుదల చేస్తారు. నీరు సమాంతరంగా పారేందుకు వాగులో ఇసుక చదును చేస్తుంటారు. గతంలో ఇసుక చదును చేస్తున్న సమయంలో చిలకలగుట్ట సమీపంలోని వాగులో ఒక దగ్గర ఇసుకను అడ్డుకట్టగా నిల్వ చేశారు. నిల్వ ఉన్న ఇసుక సంవత్సరాల తరబడి ఉండడంతో ఇసుక కొంత మేరకు మట్టిగా తయారైంది. మంత్రి సీతక్క జంపన్నవాగులో ఇసుక ఎక్కడపడితే అక్కడ తీయొద్దని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
మట్టి కలిసిన ఇసుకతోనే పనులు
ఇదే క్రమంలో అధికారులు వాగులో నిల్వ ఉన్న ఇసుకనే మేడారం జాతర పనులకు అనుమతించారు. మట్టితో కలిసిన ఇసుకను మేడారం రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. మట్టి కలిసిన ఇసుకను పనులకు వినియోగించడంతో నాణ్యత ప్రమాణాలు లోపించేనాస్కారం ఉందని ఓ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారి తెలిపారు.


