వందేమాతరం ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వందేమాతరం ఉత్సవాలు

Nov 23 2025 9:05 AM | Updated on Nov 23 2025 9:05 AM

వందేమాతరం ఉత్సవాలు

వందేమాతరం ఉత్సవాలు

ములుగు రూరల్‌: వందేమాతరం ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా కన్వీనర్‌ జాడి వెంకట్‌ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులు, 100 మంది యువతతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వందేమాతరం గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వందేమాతరం ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, కృష్ణవేణి నాయక్‌, జవహర్‌లాల్‌, రమేష్‌, మహేందర్‌, శోభన్‌, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement