చట్టాలపై అవగాహన తప్పనిసరి
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యాహక్కు, పోక్సో, ర్యాగింగ్, బాల్య వివాహ నిరోధక చట్టం గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, కళాశాల ప్రిన్సిపాల్ చందర్, అధ్యాపకులు చరణ్, గోవర్ధన్, కిరణ్‌కుమార్, సుస్మిత, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.


