డిజిటల్ లెర్నింగ్‌తో చదువు సులభం
● డీఈఓ సిద్ధార్థరెడ్డి
గోవిందరావుపేట: డిజిటల్ లెర్నింగ్‌తో చదువు మరింత సులభతరం అవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్‌లో మూడు రోజులుగా ఏ బుక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. డిజిటల్ లెర్నింగ్‌తో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. డిజిటల్ పరికరాలు సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించి బోధనను సులభతరం చేయడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి సుమారు 400 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ నైపుణ్యాలను తమ తమ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రయోజనకరంగా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బి. శ్యాంసుందర్ రెడ్డి, మండల విద్యాధికారి గొంది దివాకర్, రీసోర్స్ పర్సన్లుగా వెంకటేశ్వర్లు, సతీష్ కుమార్, శ్రీకాంత్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినులతో సమీక్ష
మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాలు, ఆహార నాణ్యత, హాస్టల్ నిర్వహణపై డీఈఓ సిద్ధార్థరెడ్డి శనివారం సమీక్ష సమావేశం హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యత, వసతి, పరిశుభ్రత, భద్రత విషయాల్లో ఎలాంటి రాజీపడమని తెలిపారు. హాస్టల్ వర్కర్లు, వాచ్‌మెన్, స్కావెంజర్లు, కుక్స్ అందరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థినులు హాస్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను వింటూ ఒక్కొక్కటిగా పరిష్కరించారు. జిల్లా గల్స్ చైల్డ్ డెవలప్‌మెంటఆఫీసర్ బుర్ర రజిత మాట్లాడుతూ విద్యార్థినుల ఫుడ్ లీడర్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దివాకర్, ప్రిన్సిపాల్ కుమార్, హాస్టల్ వర్కర్లు, ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.


