రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక
విద్యార్థి నవ్యను అభినందిస్తున్న ఉపాధ్యాయులు
విద్యార్థులను సన్మానిస్తున్న సర్దార్‌సింగ్
ములుగు రూరల్/ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలలో వెంకటాపురం(కె) మండలానికి చెందిన జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన పోటీల్లో ఫ్రీ స్టైల్ 48 కేజీల విభాగంలో ఎల్.సుజన్ ప్రథమ, 65 కిలో విభాగంలో సాయిచరణ్ ప్రథమ, 46 కిలోల విభాగంలో ఏహెచ్‌ఎస్ జగ్గన్నపేటకు చెందిన ఐశ్వర్య ప్రథమ స్థానంలో నిలిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో మెడల్స్ సాధించిన విద్యార్థులను జిల్లా క్రీడల అధికారి సర్దార్‌సింగ్ అభినందించి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లావణ్య, కోచ్ సతీష్ పాల్గొన్నారు.
కరాటే పోటీలకు..
ములుగు మండల పరిధిలోని జగ్గంపేట ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నవ్య అండర్–14 కేటగిరి విభాగంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికై ంది. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న నవ్యను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సుశీల, జయరాం, రమాదేవి, సృజన, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక


