విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి 15శాతం నిధులు విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిపులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాగర్, అన్వేష్, సాయికుమార్, రణదీప్, రామ్‌చరణ్, శివ పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్


