ములుగు రూరల్: విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడనమ్మకాల నిర్మూలనకు విద్యార్థులు నడుంబిగించాలన్నారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రాలను పాఠశాల ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. మొత్తం 24 మంది విద్యార్థులు పాల్గొనగా బండారుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం, మైనార్టీ గురుకుల పాఠశాల దేవగిరిపట్నం విద్యార్థులు ద్వితీయ స్థానం సాధిచారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, జేవీవీ నాయకులు రత్నం ప్రవీణ్, చంటి, బాలేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


