అక్రమ నిర్మాణాలను తొలగించాలి
ఏటూరునాగారం: మేడారంలో లంబాడీల అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. సమ్మక్క సారలమ్మ జాతరలో ఆదివాసీల పవిత్రతను వలస వాదులతో భంగం కలుగుతుందన్నారు. రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తూ భూములను లాక్కుంటున్నారన్నారు. అధికారులు సర్వే చేసి లంబాడీల నిర్మాణాల తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొర్నిబెల్లి గణేష్, ఆలం స్వామి, మోకాళ్ల వెంకటేష్, వెంకటేష్‌లు పాల్గొన్నారు.
సైన్స్‌ఫెయిర్‌ను
విజయవంతం చేయాలి
ములుగు రూరల్: జిల్లాలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో నిర్వహించనున్న సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ డీఎల్‌బీవీపీ, ఇన్‌స్పైయిర్ సంయుక్తంగా నిర్వహిస్తుందన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైయిర్ 20 ప్రాజెక్టులు ఈ ఏడాది నిర్వహించడం జరుగుతుందన్నారు. సుస్థిరమైన వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వాహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోదకరమైన గణిత నమూనాలు, పరిశుభ్రత, జల సంరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు.
నూతన మండలంలో సౌకర్యాలు కల్పించాలి
ములుగు రూరల్: నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండలంలో పరిపాలన సౌలభ్యం అన్ని సౌకర్యాలు కల్పించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మల్లంపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లంపల్లి ప్రజల ఆకాంక్ష మేరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మండలంగా ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన నూతన మండలంలో కార్యాలయం ఏర్పాటు చేయలేదన్నారు. మండలం ఏర్పాటు అయినప్పటికీ ప్రజలు ములుగుకు వెళ్లక తప్పడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్‌నాయక్, చందా కుమార్, చీదర్ల సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
హేమాచలుడిని
దర్శించుకున్న సీసీఎఫ్
మంగపేట: మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహా స్వామిని అటవీశాఖ కాళేశ్వరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రభాకర్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పూజా రులు శేఖర్‌శర్మ, రాజీవ్ నాగఫణిశర్మ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్న అనంతరం గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరి పించారు. ఆలయ చరిత్రను వివరించి స్వామి వారి శేషవస్త్రాలను అందించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆయన వెంట తాడ్వాయి, ఏటూరునాగారం ఎఫ్‌డీఓ వజ్రారెడ్డి, రమేష్, మంగపే ట రేంజ్ అధికారి అశోక్, డిప్యూటీ రేంజ్ అధికారి కోటేశ్వర్ ఉన్నారు.
నేడు డయల్ యువర్
సింగరేణి సీఎండీ
భూపాలపల్లి అర్బన్: నేడు (శనివారం) డయల్ యువర్ సింగరేణి సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల వంటి అంశాలపై సింగరేణి సంస్థ చైర్మన్ బలరా మ్ శనివారం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 040–23311338 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.
అక్రమ నిర్మాణాలను తొలగించాలి


