బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
● అదనపు కలెక్టర్ సంపత్‌రావు
ములుగు రూరల్: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) సంపత్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణతో బాలలపై హింస తగ్గే అవకాశం ఉందన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షమాధికారి తుల రవి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, సీడీపీఓ ప్రేమలత, శిరిష, సూపర్‌వైజర్లు, బాలసదనం సూ పరింటెండెంట్ కావ్య, సిబ్బంది పాల్గొన్నారు. అలా గే వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులను అదనపు కలెక్టర్ శా లువాతో సన్మానించారు. వయోవృద్ధులు దేశాని కి వెలకట్టలేని సంపద అన్నారు. వయోవృద్ధుల సంక్షేమ ఫోరం అధ్యక్షుడు రామూర్తి, సీడీపీఓలు శిరీష, ప్రేమలత, డీసీపీఓ ఓంకార్, వయోవృద్ధుల శాఖ ఇన్‌చార్జ్ నాగేంద్ర, గణేష్, రమాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, చంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.


