డిజిటల్ నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అవసరం
● డీఈఓ సిద్ధార్థరెడ్డి
గోవిందరావుపేట: ఉపాధ్యాయుల డిజిటల్ నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మండలపరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్‌లో గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాల అభివృద్ధి (కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం)కి మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ శుక్రవారం సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా డిజిటల్ రంగంలోనూ ప్రావీణ్యం సాధించేలా ఉపాధ్యాయుల శిక్షణ దోహదపడాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన వసతి, కంప్యూటర్ ల్యాబ్‌లు సమకూర్చినందుకు టీజీఎంఎస్ చల్వాయి ప్రిన్సిపాల్ జి.కుమార్, ఏఎంఓ శ్యాంసుందర్ రెడ్డిలతో పాటు ఆర్పీలు, డీఆర్పీలను డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు అర్షం రాజు, జి.సాంబయ్య, ఉల్లాస్ జిల్లా కో ఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు, డీఆర్పీలు వెంకటేశ్వర్లు, ఆర్పీలు లక్ష్మణ్, యూసఫ్, సుమన్, నరేందర్, జయశ్రీ, కుమార్ రాథోడ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.


