మొక్కజొన్న సాగుకు ఒప్పందం తప్పనిసరి
● జిల్లా వ్యవసాయాధికారి సురేష్
వెంకటాపురం(కె): మొక్కజొన్న సాగుకు ఆర్గనైజర్‌తో రైతులు తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మొక్కజొన్న డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అగ్రిమెంట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎంఆర్‌పీ ధరలకే ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎరువులు, పురుగు మందులకు తీసుకునే సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ, మండల వ్యవసాయ అధికారి నవీన్ తదితరులు ఉన్నారు.


