ఉద్యమాలతోనే హక్కుల సాధన | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాలతోనే హక్కుల సాధన

Nov 22 2025 6:50 AM | Updated on Nov 22 2025 6:50 AM

ఉద్యమాలతోనే హక్కుల సాధన

ఉద్యమాలతోనే హక్కుల సాధన

వెంకటాపురం(కె): ఉద్యమాలతోనే హక్కులను సాధించుకోవాలని వాడ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మెర్రవానిగూడెం పంచాయతీ పరిధి అబ్బాయిగూడెంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుకు ఉద్యమాలకు సిద్ధంకావాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీలకు 1/70 యాక్టుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చేపల వృత్తి చేసుకునే వారికి చెరువులు, కుంటల్లో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్‌రావు, బొల్లె ఆదినారాయణ, ప్రశాంత్‌, కోటేశ్వర్‌రావు, చంటి, రమేశ్‌, దేవుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement