పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పరీక్షకు ప్రణాళికతో చదివితే అర్హత సాధించవచ్చు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పిస్తున్నారు. గతంలో ఎంటే ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష నిర్వహణకు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. రెండు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశాం.
– సిద్ధార్థరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
●


