ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా?

Nov 21 2025 7:35 AM | Updated on Nov 21 2025 7:35 AM

ఈ సార

ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా?

తాజాగా ఎస్‌ఆర్‌సీ కంపెనీ చేతుల్లోకి..

వాజేడు: మరో రెండు నెలల్లో మోడికుంట ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతాయని ప్రచారం సాగుతుంది. అదే నిజమైతే ఏజెన్సీ ప్రజల ఏళ్ల నాటి కళ నెర వేరుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎస్‌అర్‌సీ కంపెనీ సర్వే పనులు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది.

2005లో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు

మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో మోడికుంట వాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 26 మే 2005న రూ.124.6 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా 1259 మీటర్ల మట్టి కట్ట, 92 మీటర్ల స్పిల్‌వే, 21.85 కిలో మీటర్ల ప్రధాన కాల్వ, 10 డిస్ట్రిబ్యూటర్లు నిర్మించాల్సి ఉంది.

తొలుత గామన్‌ ఇండియాకు పనులు

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంబాయికి చెందిన గామన్‌ ఇండియా కంపెనీ రూ.118.95 కోట్లతో జూలై 2005లో ఒప్పందం చేసుకుంది. రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. 1250 ఎకరాల అటవీ భూమి అవసరం కాగా సమస్య తలెత్తింది. ఈ ప్రాజెక్టు ద్వారా 13,590 ఎకరాలకు సాగునీరు, 35 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. పలు అనుమతులు ఆలస్యం కావడంతో పాటు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు 20 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోలేదు. కాల్వల నిర్మాణానికి భూసేకరణ జరిగినప్పటికీ కాంట్రాక్టర్‌ కాల్వ నిర్మాణాన్ని చేపట్టలేదు. పలు మార్లు నోటీసులను జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్‌ నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో 2022 ఆగష్టులో ఈ సంస్థను తొలగించి మరో సంస్థకు ప్రాజెక్టు పనులను ఇవ్వడం కోసం ప్రభుత్వం అంచనాలను సవరించింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.527.66 కోట్లుగా నిర్ధారించి 29 ఆగష్టు 2022న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి సంబంధిత శాఖ 29 అక్టోబర్‌ 2023న గామన్‌ ఇండియా సంస్థకు నోటీసులను జారీ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 31 జనవరి 2024న సదరు కాంట్రాక్టర్‌ను తొలగించినట్లు తెలిసింది.

ప్రాజెక్టు అంచనాల పెంపు

అటవీ భూముల సేకరణ, నిర్మాణ వ్యయం పెరగడంతో 2024–25 సంవత్సరానికి అనుగుణంగా తాజా అంచనాల ప్రకారం రూ.720.84 కోట్లుగా నిర్ధారించారు. సంబంధిత ప్రతిపాదనలను ఇంజనీరింగ్‌ శాఖ పంపగా రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ 2024 నవంబర్‌ నెలలో పరిశీలించి రూ.718.60 కోట్లుగా ఆమోదించింది. ఈ మేరకు 17మే 2025న నీటి పారుదల శాఖ అధికారిక శాఖ నివేదికలను పంపించింది. 29 జూలై 2025న నిర్వమించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంచనాలను పెంచినట్లు సమాచారం.

పనులు దక్కించుకున్న

ఎస్‌ఆర్‌సీ ఇంఫ్రా కంపెనీ

ప్రాజెక్టు స్థలం వద్ద సర్వే పనులు షురూ

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎస్‌అర్‌సీ కంపెనీ టెండర్‌ ద్వారా పనులు దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు సదరు కంపెనీ కృష్ణాపురం గ్రామ సమీపంలో మోడికుంట ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంలో సర్వే పనులు చేపట్టినట్లు సమాచారం. రెండు నెలల్లో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ సారైన ప్రాజెక్టు పనులను చేపట్టి నిర్మాణ పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా?1
1/2

ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా?

ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా?2
2/2

ఈ సారైనా మోడికుంట పూర్తయ్యేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement