ములుగు రూరల్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, పాఠకులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, గ్రంథాలయ పాలకురాలు సమ్మక్క, రాకేశ్, పాఠకులు పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న కళాబృందం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ కళాబృందం సభ్యులు గురువారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళాబృందానికి పూజారి యాదగిరి, మేడారం తుడుందెబ్బ గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు మ్యూజియాన్ని సందర్శించి ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాల చిత్రాలు, పురాతన వస్తువులను వీక్షించారు. కళాకారులకు పూజారులు విడిది సౌకర్యం, విందు భోజన వసతి కల్పించారు.
ఉత్తమ పౌరులుగా ఎదగాలి
వాజేడు: ప్రతీ విద్యార్థి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ కడారి సుమన్, చైల్డ్ హెల్ప్‌లైన్ కేసు వర్కర్ చంటి, హెచ్‌ఎం ఆనందరావు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహించగా పాల్గొని మాట్లాడారు. బాలలు శారీరక ఎదుగుదలను అర్ధం చేసుకోవాలన్నారు. బావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి జీవన నైపుణ్యాలను అలవర్చుకోవాలని వివరించారు. బాలలు తమ హక్కులకు భంగం కలిగిస్తే 1098 ఫోన్ నంబర్‌కు కాల్ చేయాలని వివరించారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, రాజ్యలక్ష్మి, కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: స్వయం ఉపాధి అవకాశాలను యువత, మహిళా సంఘాల సభ్యులు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో సీఎంఈజీపీ పథకంపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్థానిక యువత, మహిళా సంఘాల సభ్యులు వ్యాపారాల పట్ల ఆసక్తి చూపాలన్నారు. పీఎంఈ జీపీ అర్హత, రుణ పరిమితి, సబ్సిడీ ప్రయోజనాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ గురించి వివరించారు. వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన ప త్రాలు, డీపీఆర్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ, కేవీఐసీ, డీఐసీ, బ్యాంకుల పాత్ర గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇడీసీ మేనేజర్ విక్రమ్, అసిస్టెంట్ మేనేజర్ భూక్య శ్రీకాంత్, రీసోర్స్ పర్సన్ అశోక్, జయప్రకాశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి, డీపీఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


