ప్రతిభకు ప్రోత్సాహం
23న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష.. హాజరు కానున్న 247 మంది
ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు అర్హులుగా గుర్తించారు. విద్యార్థులు ఏడవ తరగతిలో 55 శాతం మార్కుల సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం సాధించాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు హాస్టల్ వసతి లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
● ఎంపికై న విద్యార్థులకు రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం
● నాలుగేళ్లపాటు అందజేయనున్న కేంద్ర ప్రభుత్వం
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఆర్ధిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను అర్హులుగా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఉపకారవేతనం అందిస్తారు. అర్హత పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 12వేల చొప్పున ఉపకార వేతనం విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.
ప్రతిభకు ప్రోత్సాహం


