ముగిసిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని కొమురం భీమ్ మినీ స్టేడియంలో రెండు రోజుల పాటు ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడాపోటీలు గురువారం ముగిశాయి. అట్టహాసంగా ప్రారంభమైన పోటీల్లోని విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఐటీడీఏ డీడీ దబ్బగట్ల జనార్ధన్ తెలిపారు. కబడ్డీలో అండర్ 17 బాలురలో మొదటి బహుమతి ఏటూరునాగారం గెలుపొందగా, ద్వితీయ బహుమతి హనుమకొండ దక్కించుకుంది. వీరికి డీడీ దబ్బగట్ల జనార్ధన్ బహుమతులను అందజేశారు. అలాగే కబడ్డీ బాలికల విభాగంలో ములుగు మొదటి బహుమతి, మహబూబాబాద్ రెండో బహుమతి గెలుపొందింది. ఖోఖోలో బాలికల విభాగంలో ములుగు మొదటి బహుమతి, కొత్తగూడ రెండో బహుమతి గెలుచుకుంది. ఏటూరునాగారం మొదటి బహుమతి, కొత్తగూడ రెండో బహుమతి గెలుచుకుంది.టెన్నికాయిట్‌లో బాలురు కొత్తగూడ మొదటి బహుమతి, మహబూబాబాద్ రెండో బహుమతి గెలుపొందగా బాలికల్లో కొత్తగూడ మొదటి బహుమతి, ములుగు రెండో బహుమతి గెలుచుకుంది. అలాగే అండర్ 14లో విభాగంలో టెన్నికాయిట్‌లో కొత్తగూడ మొదటి బహుమతి, మహబూబాబాద్ రెండో బహుమతి, బాలికల్లో భూపాలపల్లి మొదటి బహుమతి, వాజేడు రెండో బహుమతి గెలుచుకున్నారు. కబడ్డీలో మొదటి బహుమతి భూపాలపల్లి, రెండో బహుమతి ములుగు గెలుపొందగా బాలురలో మొదటి బహుమతి కొత్తగూడ, రెండో బహుమతి ఏటూరునాగారం జట్లు గెలుపొందినట్లు జనార్ధన్ తెలిపారు. ఖోఖో బాలికల పోటీల్లో మొదటి బహుమతి భూపాలపల్లి, రెండో బహుమతి ములుగు జట్లు గెలుపొందినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓలు అజయ్‌కుమార్, ఉపేందర్, భాస్కర్, స్పోర్ట్స్ ఆఫీసర్‌లు యాలం ఆదినారాయణ, నారాయణ, కొమ్మాలు తదితరులు పాల్గొన్నారు.
రాణించిన గిరిజన విద్యార్థులు
బహుమతులు అందజేసిన డీడీ
ముగిసిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు


