● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
మంగపేట : ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ నిర్వహణ రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంగపేట, వైద్యాధికారి స్వప్నిత, చుంచుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి యమున, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం అసంఘటిత వ్యాదుల నివారణ(ఎన్‌సీడీ) సిబ్బందికి ప్రొగ్రాం అధికారి పవన్‌కుమార్ ఎన్‌సీడీ స్క్రీనింగ్‌పై శిక్షణ కల్పించారు. సకాలంలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమం త్వరితగతిన పూర్తయ్యే విధంగా వైద్యాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వెంకట్, ఆయా పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.


