సీసీఐ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ములుగు రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని జాకారం సమీపంలో గల రాజరాజేశ్వర కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆమె గురువారం ప్రారంభించి మాట్లాడారు. పత్తి రైతులకు మిల్లర్లతో సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. రైతులకు అన్యాయం జరుగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


