16 రోజులు.. 4 వేల కిలోమీటర్ల సైక్లింగ్
ములుగు: కశ్మీర్ టు కన్యాకుమారి వరకు 4వేల కిలోమీటర్ల సైక్లింగ్ రైడ్‌ను 16 రోజుల్లో జిల్లా ఫైర్ అధికారి నాగరాజు పూర్తిచేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనను బుధవారం ట్రైసిటీ రైడర్స్ వరంగల్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అగ్నిమాపక సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు. సర్ధార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఫిట్ ఇండియాలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఆఫర్స్ అండ్ స్పోర్ట్స్ వారు మొట్ట మొదటిసారిగా ఇండియాలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీఏ రైడ్ ఫర్ యునిటీశ్రీ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో 31 రాష్ట్రాల నుంచి 3 వేల మంది దరఖాస్తు చేసుకోగా 150 మందిని ఎంపిక చేశారు. ఈ పోటీలో జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగరాజు ఎంపికయ్యారు. నవంబర్ 1న శ్రీనగర్ నుంచి మొదలైన సైక్లింగ్ ఈ నెల 16వ తేదీ వరకు సాగింది. కన్యాకుమారికి చేరుకునేలా రోజుకు 250 కిలోమీటర్ల చొప్పున 16 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సైక్లింగ్ రైడ్ అందమైన అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సైక్లింగ్ రైడ్ మరిచిపోలేనిదని ఆనందం వ్యక్తం చేశారు.
పూర్తిచేసిన జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగరాజు
సన్మానించిన ట్రైసిటీ రైడర్స్ వరంగల్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది


