కాటారం: యువజన క్రీడా ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీల్లో మండలకేంద్రంలోని కేజీబీవీ, కాటారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బృంద గీతంలో కేజీబీవికి చెందిన పరిమళ బృందం ఉత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానంలో నిలవగా.. బృందనృత్య విభాగంలో సౌమ్య బృందం రెండో స్థానంలో, కాటారం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విజ్ఞా బంజార బృందం డప్పు నృత్యంలో ప్రతిభ కనబరిచింది. పరిమళ బృందం, విజ్ఞా బంజార బృందంను రాష్ట్రస్థాయి యువజన పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సునీత, జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సోమలింగం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.


