ఉల్లాస్‌తో విద్యాబోధన
వలంటీర్లతో విద్యాబోధన
మహిళా సంఘాల్లోని సభ్యులకు సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం
ఏటూరునాగారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యావిధానంలో భాగంగా ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్‌ది సొసైటీ) అనే నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మహిళలకు చదవడం, రాయడం, నేర్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
అమ్మకు అక్షరాలు..
అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అన్ని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆ అంటే అక్షరాలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించపోతున్నారు. నారీ లోకానికి అక్షర విజ్ఞానం లేక అనేక కుటుంబాలు వెనుకబడుతున్నాయని 2022లో కేంద్ర ప్రభుత్వం అక్షర విజ్ఞానంపై సర్వే చేపట్టింది. అయితే అందులో ఎక్కువ శాతం మహిళలు నిరక్షరాస్యులుగా ఉండడం గమనార్హం. వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే చదువు ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపట్టింది. అమ్మకు అక్షరమాల అనే నినాదంతో ఉల్లాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ కార్యక్రమంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీ నుంచి జిల్లాలోని 9 మండలాల్లో సెర్ప్(ఐకేపీ) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు(ఎస్‌హెచ్‌జే) అక్షరాలు నేర్పించడం ప్రారంభించారు. మండల సమాఖ్య కేంద్రాల్లో వారం రోజుల పాటు శిక్షణను నిర్వహించారు. శిక్షణ పొందిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించిన అక్షర వికాసం పుస్తకాలను అందించారు.
జిల్లాలోని 9 మండలాల్లో గల మహిళా సంఘాల్లో 68,532 మంది సభ్యులు ఉన్నారు. అందులో చదువుకోని వారు 7,586 మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించి వారికి పది మందికి ఒకరి చొప్పున 940 మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. 10 మంది మహిళా సభ్యులకు అందులో ఒకరిని వలంటీర్‌గా నియమించి చదువు చెప్పినందుకు కొంత పారితోషికం ఇచ్చేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
జిల్లాలో 7,586 మంది
నిరక్షరాస్యుల గుర్తింపు
940 మంది వలంటీర్ల కేటాయింపు
ఉల్లాస్‌తో విద్యాబోధన
ఉల్లాస్‌తో విద్యాబోధన


