డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి
● జిల్లా సంక్షేమాధికారి తుల రవి
ములుగు రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. జిల్లా కేంద్రంలో నషా ముక్త్ భారత్ అభియాన్ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్ష్యంతో ముందుకుసాగాలన్నారు. డ్రగ్స్‌కు బానిసగా మారితే మానడం చాలా కష్టమని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన వారిని గుర్తిస్తే టీజీఏఎన్‌బీ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు చెడు మార్గంలో వెళ్లకుండా ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్‌శాఖకు ప్రతిఒక్కరూ సహకరించాలనానరు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భగవద్గీత, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ అనూష, నషా ముక్త్ అభియాన్ జిల్లా ఇన్‌చార్జ్ నాగేంద్ర, ఎఫ్‌ఆర్‌ఓ గణేశ్, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


