న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2025
వినతులు
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్ దివాకర
గ్రీవెన్స్‌లో 62, గిరిజన దర్బార్‌లో 8 అర్జీలు
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవె న్స్, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజలు పలు సమస్యలపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర, ఐటీడీఏలో డీటీ అనిల్ గిరి జనుల సమస్యలను ఆలకించి అర్జీలు స్వీకరించా రు. ప్రజావాణిలో 62, గిరిజన దర్బార్‌లో వచ్చిన 8 వినతులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు.
గిరిజన దర్బార్‌లో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని హాస్టల్‌లో నైట్‌వాచ్‌మెన్ పోస్టు ఇప్పించాలని వినతి అందజేశారు. జిల్లాలోని పేరూరు గ్రామస్తులు 17, చెల్పాక గ్రామస్తులు 5, గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన మరికొందరు బాధితులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విన్నవించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన మహిళ భర్త ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అలాగే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా కమిటీ నుంచి గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను రెగ్యూలర్ ప్రాతిపదికన గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని వినతి పత్రం అందజేశారు. వాజేడు, వెంకటాపురం గురుకులం బాలికల కళాశాలలో ఎంపీడబ్ల్యూ ఉద్యోగం తిరిగి ఇప్పించాలని బాధితురాలు దరఖాస్తు అందజేశారు. ఏటూరునాగారం మండల పరిధిలోని ఆకులవారి ఘనపురంలో కొనుగోలు చేసిన భూమిని గిరిజనేతరులు దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని న్యాయం చేయాలని బాధితురాలు వినతి అందజేసింది. ఈ గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ ఆఫీస్ మేనేజర్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వెంకటాపురం శివారులో 1746/బి సర్వే నంబర్‌లో 2.10ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. గతంలో అధికారులు పట్టా జారీ చేశారు. నూతన పాస్‌బుక్‌లో 2 ఎకరాలు మాత్రమే పట్టా చేశారు. 10 గుంటల భూమిని వేరే వ్యక్తి పేరున పట్టా చూపిస్తుంది. ఈ విషయంపై తహసీల్దార్‌ను పలుమార్లు కలిసినా సమస్య పరిష్కారం కాలేదు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి పట్టాజారీ చేయాలి.
– కొనాల ఓదెలు, వెంకటాపురం(ఎం)
నా భర్త మరణించి రెండేళ్లు గడిచింది. పలుమార్లు వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినా పింఛన్ మంజూరు కాలేదు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఉన్నతాధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలి.
– కేలోత్ వినోద, ములుగు
●
గ్రామంలోని తనకు వారసత్వంగా వచ్చిన భూమిని వేరే వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంపై ఆధారాలతో కోర్టును ఆశ్రయించాను. కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను అధికారులకు ఇచ్చినా అమలు చేయడం లేదు. భూమి మోకాపైకి వెళ్తే కబ్జాదారులు దాడులకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – జంగం ఆదినారాయణ, మల్లూరు, మంగపేట
స్వీకరించిన కలెక్టర్ దివాకర, డీటీ అనిల్
పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు
70
70
70
70
70


