కావడిలో తీసుకొచ్చి.. వైద్యం చేయించి..
వెంకటాపురం(కె): ప్రభుత్వాలు మారినా ఏజెన్సీ ప్రజలకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. మండల పరిధిలోని పామూలూరులో 10కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మడవి అడమ జ్వరంతో బాధపడుతోంది. ఆదివాసీలకు అత్యవసర వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. దీంతో ఆ మహిళను వైద్య చికిత్స కోసం కావడిలో 20కిలో మీటర్లు గుట్టల పైనుంచి తీసుకొచ్చి మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.


