హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్‌స్కూల్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు అదివారం ఉదయం ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో ఉంటున్న తమకు సెక్యూరిటీ కరువైందని, నాలుగు నెలలుగా ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉండడం లేదని, హాస్టల్ పరిసరాల్లో లైట్లు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నామని పేర్కొంటూ హాస్టల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న డీఈఓ సిద్ధార్థరెడ్డి, తహసీల్దార్ గిరిబాబు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కేర్ టేకర్ కవిత, ఏఎన్‌ఎం జ్యోతి, వాచ్‌మెన్ అంజలిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. హాస్టల్‌లో తక్షణమే అదనపు లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని, వారంలోగా విద్యార్థులకు మౌలిక వసతులకు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ రజిత, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి పాల్గొన్నారు.
జవహర్‌నగర్ మోడల్‌స్కూల్‌ను సందర్శించిన డీఈఓ సిద్ధార్థరెడ్డి
కేర్ టేకర్, ఏఎన్‌ఎం, వాచ్‌మెన్ సస్పెన్షన్
హాస్టల్ విద్యార్థినుల ఆందోళన


